Khaleja: రీరిలీజుల్లో మహేష్ రికార్డు

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజులు జోరుగా జరుగుతున్నాయి. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా నచ్చిన ప్రతీ సినిమానీ రీరిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఆడియన్స్ కూడా ఈ ట్రెండ్ ను ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రీరిలీజులు బాగానే వసూలు చేస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా రీరిలీజ్ అయింది.
ఖలేజా(Khaleja) రీరిలీజ్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖలేజా రీరిలీజ్ కు డే1 కలెక్షన్లు రూ.5 కోట్లకు పైగా వచ్చింది. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు రీరిలీజ్ అవ్వగా అందులో పలు సినిమాలు ఎక్కువ వసూలు చేసి రికార్డులను నెలకొల్పగా, ఎక్కువ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా ఖలేజా కొత్త రికార్డు సృష్టించింది.
మొదటి సినిమాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గబ్బర్ సింగ్(Gabbar Singh) ఉండగా, రెండో సినిమాగా ఖలేజా నిలిచింది. టాలీవుడ్ రీరిలీజుల్లో రూ.5 కోట్ల గ్రాస్ కంటే ఎక్కువ వసూలు చేసిన సినిమాల్లో బిజినెస్ మ్యాన్(Business Man), మురారి(Murari), గబ్బర్ సింగ్(Gabbar Singh) తో పాటూ ఇప్పుడు ఖలేజా కూడా చేరింది. ఈ లిస్ట్ లో మూడు మహేష్ బాబు సినిమాలే ఉండటం విశేషం. అయితే ఖలేజా డే1 మంచి కలెక్షన్లను అందుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డే1 రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.