ఇజ్రాయెల్ రాయబారితో కంగనా రనౌత్ భేటీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నావోర్ గిలన్ను కలిసి మద్దతు తెలిపారు. తీవ్రవాదంపై పోరులో విజయం సాధిస్తారన్న నమ్మకం తనకుందని ఆయనతో వ్యాఖ్యానించారు. నావోర్ గిలన్తో సమావేశం ఆత్మీయంగా సాగింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం ముఖ్యంగా భారత్, ఇజ్రాయెల్ తీవ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి అని కంగనా పేర్కొన్నారు. రావణ దహన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఢిల్లీ వచ్చా. అప్పుడే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సందర్శించాలనుకున్నా. ఆధునిక రావణుడిని, హమాస్ లాంటి తీవ్రవాదులను ఓడిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకుని రాయబారిని కలిశా అని ఆమె తెలిపారు.













