Thug Life: మరోసారి నెట్ ఫ్లిక్స్ తో థగ్ లైఫ్ బేరాలు

కమల్ హాసన్(Kamal Hassan)- మణిరత్నం(Mani Ratnam) కాంబినేషన్ లో తెరకెక్కిన థగ్ లైఫ్(Thug Life) సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. రిలీజ్ కు ముందు థగ్ లైఫ్ సినిమా నాయగన్(Nayagan) ను మించి హిట్ అవుతుందని కమల్ ఎంతో నమ్మకంగా చెప్పాడు. కానీ రిలీజ్ తర్వాత థగ్ లైఫ్ సినిమా మణిరత్నం కెరీర్ లోనే అత్యంత బ్యాడ్ సినిమాగా తెరకెక్కిందని కామెంట్స్ వచ్చాయి.
మామలూగా ముందు కుదుర్చుకున్న డీల్ ప్రకారమైతే థగ్ లైఫ్ సినిమా 8 వారాలకు నెట్ ఫ్లిక్స్ లో రిలీజవాలి. కానీ ఇప్పుడు థగ్ లైఫ్ డిజాస్టర్ అవడంతో కథ మొత్తం మారిపోయింది. పరిస్థితులు చూస్తుంటే సెకండ్ వీక్ లోనే థగ్ లైఫ్ ఫైనల్ రన్ కు చేరుకునేలా ఉంది. దీంతో ఉన్న దాంట్లోనే మంచి లాభాలు రాబట్టుకోవాలని థగ్ లైఫ్ టీమ్ మరోసారి నెట్ ఫ్లిక్స్ తో బేరాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
అందులో భాగంగానే ముందు 8 వారాలకు డీల్ కుదుర్చుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు నెలకే సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందట. ఇలా చేయడం వల్ల థగ్ లైఫ్ నిర్మాతలకు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు నెట్ ఫ్లిక్స్ ఇచ్చే అవకాశముంది. అలా అని మరీ ఎక్కువ మొత్తమేమీ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. కాకపోతే ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కే ఛాన్సుందని రీసెంట్ టైమ్స్ లో కంగువా(Kanguva), విడాముయార్చి(Vidamuyarchi), రెట్రో(Retro) లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ నమ్మకంతోనే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు థగ్ లైఫ్ టీమ్ తో మరోసారి బేరానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ కోలీవుడ్ లో మాత్రం ఈ వార్తలు తెగ వినిపిస్తున్నాయి.