స్టార్ పవర్ ను వేస్ట్ చేసుకున్న జైలర్2
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన జైలర్(jailer) సక్సెస్‌లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఆయా నటులు తెరపై కనిపించిన సందర్భాల్లో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. దీంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) సీక్వెల్ జైలర్2 (jailer2) లోనూ ఇదే ఫార్ములాను అనుసరించారు. అయితే ఈసారి అన్ని క్యామియోలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్టార్ల ఎంట్రీలు ఆడియన్స్ ను అలరించగా, మరికొన్ని క్యారెక్టర్లు నిడివి, ప్రాధాన్యత లేక సాధారణంగానే మిగిలిపోయాయి.
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్(sivaraj kumar)కు కీలకమైన పాత్ర దక్కగా, ఆయన సరైన టైమ్ లో స్క్రీన్ పై కనిపించి కథకు అవసరమైన హై ఇచ్చారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ క్యారెక్టర్ కు బలంగా నిలిచింది. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(mohanlal) క్యారెక్టర్ లిమిటెడ్ సీన్స్‌కే పరిమితమైందని, ఆయన స్థాయికి తగిన ప్రాధాన్యత దక్కలేదనే డిస్కషన్ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik roshan) క్యామియో కూడా అంచనాలకు తగ్గ ప్రభావం చూపలేదని టాక్. ఆయనకు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తొలగిపోయాయనే ప్రచారం వినిపిస్తోంది. జాకీ ష్రాఫ్(Jockey shroff) క్యారెక్టర్ సైతం పెద్దగా గుర్తుండిపోయేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక విజయ్ సేతుపతి(Vijay sethupathi) క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ ఎడిటింగ్ అయిందని టాక్ ఉండగా, చివర్లో ఆయన కనిపించడం నెక్ట్స్ పార్ట్ పై ఆసక్తిని పెంచింది. కమెడియన్ సంతానం(santhanam) షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ, ఆయన క్యారెక్టర్ పూర్తిగా తొలగించినట్లు సమాచారం. మొత్తంగా జైలర్2లో స్టార్ క్యామియోల సెలెక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కథకు బలంగా మలచడంలో నెల్సన్ ఈసారి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదనే డిస్కషన్ నడుస్తోంది.








