Hrithik Roshan: నిర్మాతగా మారనున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్(hrithik roshan) ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే హీరోగా బాగా సక్సెస్ అయిన హృతిక్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. HRX ఫిల్మ్స్ అనే బ్యానర్ ను పెట్టి అందులో సినిమాలు తీయాలని అనుకుంటున్న హృతిక్, తన మొదటి ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం.
ప్రైమ్ వీడియో(prime video)తో కలిసి హృతిక్ ఓ వెబ్‌సిరీస్ ను నిర్మించబోతున్నాడని, టబ్బర్(tabbar) అనే సిరీస్ కు దర్శకత్వం వహించిన అజిత్ పాల్ సింగ్(ajith Pal singh) ఈ సిరీస్ కు కూడా దర్శకత్వం చేయనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఓ సోషల్ థ్రిల్లర్ గా రానుందని మరియు ఇందులో ఎక్కువగా లేడీస్ నటించనున్నారని తెలుస్తోంది. ఉమెన్ సెంట్రిక్ సిరీస్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వినిపిస్తోంది.
మలయాళ నటి పార్వతి తిరువోతు(parvathy thiruvothu) ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఆమెతో పాటూ ఆలయ ఎఫ్(Aalaya F), సృష్టి శ్రీవాస్తవ(Srushti srivastava), సబా ఆజాద్(sabha azad), రామ శర్మ(Rama sarma) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూడేళ్లుగా హృతిక్ సొంత బ్యానర్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తుండగా, ఇన్నాళ్లకు ఆయన నిర్మాణ సంస్థలో మొదటి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఇయర్ ఎండింగ్ కు ఈ వెబ్ సిరీస్ మొదలయ్యే అవకాశాలున్నాయి.