Hrithik Roshan: కనీసం వారమైనా ట్రై చేయండి

సోషల్ మీడియా వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ దానికి బానిసలైపోతున్నారు. దాని వల్ల ఎంతో టైమ్ వేస్ట్ చేయడంతో పాటూ సోషల్ మీడియా లేకపోతే ఉండలేని స్థాయికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కొత్తగా వివిధ ప్రయోగాలు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(hrithik roshan) కూడా ఈ సోషల్ మీడియా డిటాక్స్ ను ఫాలో అయ్యారట. దాని వల్ల తనలో ఎంతో మార్పు వచ్చిందని, అందరినీ ట్రై చేయమని కోరారు. సోషల్ మీడియా వల్ల ఎంతో టైమ్ వేస్ట్ అవుతుందని, దానికి దూరంగా ఉంటే ఎంతో టైమ్ ఆదా అవుతుందని, ఆ టైమ్ లో మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే వీలుంటుందని, గతంలో తాను ట్రై చేసి చాలా మారానని, కనీసం వారం రోజులైనా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ట్రై చేయమని హృతిక్ రోషన్ తన ఫ్యాన్స్ ను కోరారు.
కాగా హృతిక్ రోషన్ నటించిన వార్2(war2) సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖర్జీ(ayaan mukharjee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్(war) సినిమాకు సీక్వెల్ గా రానుండగా ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కీలక పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.