Viswamabhara: విశ్వంభర కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ

గత కొన్ని సినిమాలుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలు అనుకున్న ఫలితాల్ని అందుకోవడం లేదు. భోళా శంకర్(Bhola Shnkar) రిజల్ట్ తో అసలు విషయాన్ని గ్రహించిన చిరూ, తన తర్వాతి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే బింబిసార(bimbisara) ఫేమ్ వశిష్ట(Vassista) దర్శకత్వంలో విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరూ.
త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుండగా ఈ సినిమా నుంచి గతేడాది రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ విషయంలో ఓకే అయినప్పటికీ వీఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని చాలానే కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఏకంగా మేకర్స్ వీఎఫ్ఎక్స్ టీమ్ ను మార్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ విశ్వంభర కోసం వర్క్ చేస్తున్నారని, ఈ సినిమా కోసం వారు సాలిడ్ అవుట్‌పుట్ ను అందిస్తున్నారని, వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచించాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మెగా ఫిల్మ్ కు హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్ రానుందన్నమాట.