ఓటీటీ ప్రెజర్ కు ఇరుముడి రన్ ముగిసిందా?
మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers) వంటి అగ్ర నిర్మాణ సంస్థకు భారీ లైనప్‌తో పాటు ఓటీటీ మార్కెట్లోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే ఇరుముడి(Irumudi) విషయంలో థియేట్రికల్ రన్, డిజిటల్ రిలీజ్ మధ్య సమన్వయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శివ నిర్వాణ(Siva nirvana) దర్శకత్వంలో రవితేజ(ravi teja) నటించిన ఈ సినిమా ఐదో వారంలోనూ కొన్ని ఏరియాల్లో ఆడియన్స్ ను ఆకర్షిస్తుండగా, నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో థియేటర్లలో సినిమాకు లభిస్తున్న అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
సాధారణంగా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఓటీటీ రిలీజ్‌ను కొంత ఆలస్యం చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇరుముడి విషయంలోనూ మైత్రి సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్రతినిధులతో డిస్కషన్స్ జరిపినట్టు సమాచారం. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లో మార్పు తీసుకురావడం సాధ్యపడలేదు. దీంతో థియేటర్లలో ఇంకా ఆదరణ ఉన్న సినిమాకు ఓటీటీ ఎంట్రీ ముందుగానే వచ్చేసింది.
ఇదే సమయంలో మైత్రి నిర్మాణంలో ప్రభాస్(prabhas), అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram charan) వంటి అగ్ర హీరోల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి భారీ నిర్మాణ సంస్థ నుంచి ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన డిజిటల్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ భాగస్వామ్యాల్లో మరింత సౌలభ్యం ఉంటుందా అనే డిస్కషన్ మొదలైంది. ఇరుముడి ఎక్స్‌పీరియెన్స్ మాత్రం థియేట్రికల్ విండో విషయంలో నిర్మాతలకు కొత్త ఆలోచన అవసరాన్ని సూచిస్తోంది.








