మెగా డీఎస్సీ అభ్యర్థుల సంచలన రౌండ్ టేబుల్ సమావేశం..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ–2025(Mega Dsc) నియామకాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ విమర్శలపై అభ్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడ వేదికగా ఈరోజు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు అత్యవసరంగా ఒక “రౌండ్ టేబుల్ సమావేశం” నిర్వహించారు. కేవలం రాజకీయ స్వార్థంతో, ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ముఠా తమ ఉద్యోగ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని, తప్పుడు ఆరోపణలను తాము ఆధారాలతో సహా తిప్పికొడతామని అభ్యర్థులు ఈ సందర్భంగా పబ్లిక్‌గా హెచ్చరించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా రాత్రింబగళ్లు కష్టపడి చదివి, కేవలం తమ సొంత ప్రతిభతోనే ఈ ఉద్యోగాలను సాధించామని స్పష్టం చేశారు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఈ నియామకాలను, తమ కష్టాన్ని మరియు విజయాన్ని రాజకీయ వివాదాలుగా మార్చి తమ జీవితాలతో ఆడుకోవద్దని వైసీపీ నేతలకు అభ్యర్థులు గట్టిగా విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక, ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోతూ నిరాశలో మునిగిపోయిన నిరుద్యోగ యువతకు.. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ ద్వారా సరికొత్త ఆశలు కల్పించిందని వారు వెల్లడించారు.
రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని, మాట ఇచ్చిన ప్రకారం అత్యంత వేగంగా మెగా డీఎస్సీని నిర్వహించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభ్యర్థులు ఈ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన కూటమి ప్రభుత్వానికి తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. జగన్ ముఠా సోషల్ మీడియాలో మరియు ప్రెస్ మీట్లలో వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాలను, ఫేక్ వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని.. మెగా డీఎస్సీ నియామకాలపై ఉన్న వాస్తవాలను, ఆధారాలను గమనించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.








