Gouri Kishan: కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన గౌరీ కిషన్ బాడీ షేమింగ్
96 అనే తమిళ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రను చేసి ఎంతో పాపులరైంది గౌరీ కిషన్(gouri kishan). 96 తెలుగు రీమేక్ జాను(jaanu)లో కూడా గౌరీ నటించింది. 96 మూవీతో వచ్చిన క్రేజ్ ద్వారా వరుస అవకాశాలను అందుకుంటున్న గౌరీ రీసెంట్ గా అబిన్ హరికరణ్(abin harikaran) దర్శకత్వంలో అదర్స్(Others) అనే మూవీని చేసింది. నవంబర్ 7న రిలీజైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.
ఆ ప్రెస్ మీట్ లో గౌరీకి ఓ జర్నలిస్ట్ నుంచి ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అదర్స్ మూవీలో హీరో ఓ సీన్ కోసం హీరోయిన్ అయిన గౌరీ ఖాన్ ను ఎత్తుకుంటాడు. ఆ సీన్ గురించి అడుగుతూ హీరోయిన్ బరువు గురించి ప్రస్తావించగా, వెంటనే దానికి స్పందిస్తూ గౌరీ కిషన్ ఫైర్ అయింది. ఓ ప్రొఫెషనల్ ఈవెంట్ లో ఇలాంటి పర్సనల్ కామెంట్స్ ఇండస్ట్రీలోని మహిళల బాడీ షేమింగ్ ను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఈవెంట్లో తన పాత్ర గురించి కానీ, సినిమా గురించి కానీ మాట్లాడకుండా తన బాడీ గురించి రిపోర్టర్ మాట్లాడటంతో తాను తీవ్రంగా నిరాశ చెందానని, ఆ సమయంలో ఈవెంట్ లో మహిళగా తానొక్కటే ఉండటం వల్ల తనను టార్గెట్ చేశారని, ఇది చాలా దురదృష్టకరమని చెప్పగా, చెన్నై ప్రెస్ క్లబ్ తర్వాత ఆ జర్నలిస్ట్ తీరును ఖండిస్తూ, బాడీ షేమింగ్ కు వ్యతిరేకంగా నిలబడిన గౌరీకి మద్దతునిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారగా, గౌరీకి పలువురు సెలబ్రిటీలు మద్దతిస్తూ, ఆమె రియాక్ట్ అయిన తీరుని ప్రశంసిస్తున్నారు.







