హిలేరియస్ ఎంటర్టైనర్గా ‘అనుమాన పక్షి’ టీజర్
‘DJ టిల్లు’తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ‘అనుమాన పక్షి‘ అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్ మయూర్‌తో జతకట్టారు. రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. రమణ గోగుల ఆలపించిన ఈ చిత్రంలోని మొదటి పాట ‘గులాబ్ జామ్’ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్లో రాగ్ మయూర్ పోషించిన పాత్రను పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ, తన తల్లిదండ్రులను, ప్రేయసిని కూడా అనుమానించే స్వభావం ఉన్న యువకుడిగా కనిపించిన తీరు ఆకట్టుకుంది. అతని ఈ అనుమాన స్వభావం వల్ల వరుసగా జరిగే విచిత్రమైన, హాస్యభరితమైన, గందరగోళ సంఘటనలతో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.
ఇవి కూడా చదవండి
ఈ చిత్రం రెగ్యులర్ స్టొరీ ఫార్ములాలకు భిన్నంగా, వినూత్నమైన, ఆఫ్‌బీట్ నేరేషన్‌తో సాగుతుందనే టీజర్ తో స్పష్టమవుతుంది. ఫ్రెష్ నెస్, యూనిక్, అనూహ్యమైన మలుపులతో కూడిన కథన శైలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విమల్ కృష్ణకు ప్రత్యేకమైన వినూత్న కామెడీ శైలి ఈ టీజర్ అంతటా కనిపిస్తుంది. విభిన్నమైన పాత్రలు, నేచురల్ హ్యుమర్ తో మరోసారి గుర్తుండిపోయే వినోదాన్ని అందించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధమౌతుంది
ఎప్పుడూ అనుమానపడే హీరో పాత్రలో రాగ్ మయూర్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథానాయికగా మెరిన్ ఫిలిప్ ఆకట్టుకోగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అజయ్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, మస్త్ అలీ తమ తమ పాత్రల్లో అలరించారు.
సాంకేతికంగా టీజర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామా చిత్రానికి ప్రత్యేకమైన విజువల్ స్టైల్ అందించగా, శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లోని వినోదాన్ని మరింత పెంచింది. జేకే మూర్తి ప్రొడక్షన్ డిజైన్ సినిమా వర్క్ద్ కి సరైన టచ్ ఇవ్వగా, ఎడిటర్ చోటా కె. ప్రసాద్ టీజర్‌ను షార్ఫ్ గా కట్ చేశారు.
మొత్తంగా ‘అనుమాన పక్షి’ టీజర్ నవ్వులు పంచే వినోదభరిత ప్రయాణానికి ఆహ్వానం పలుకుతోంది. టీజర్ చూస్తుంటే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ చిత్రం జూలై 10న థియేటర్లలో విడుదల కానుంది.








