చిరూ, రజినీలతో ఎవరితో ముందు?
ఈ వయసులో కూడా రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ నేటి తరానికి టఫ్ కాంపిటిషన్ ఇస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రజినీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ తో చేసిన జైలర్ సినిమా ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత రజినీ మరో రెండు సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే బింబిసార డైరెక్టర్ శ్రీ వశిష్ఠతో మూవీ చేయడానికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. బింబిసార సినిమా చూశాక విశిష్ఠను ఇంటికి పిలిపించుకుని మరీ రజినీకాంత్ అభినందించిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత ఛాన్స్ తీసుకుని వశిష్ఠ వినిపించిన లైన్ కు రజినీ ఓకే చెప్పాడని, త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలొచ్చాయి.
కానీ రజినీతో సినిమా చేయాలంటే వశిష్ఠ మరో ఏడాదికి పైగానే వెయిట్ చేయాల్సి వస్తుంది. జైలర్ తర్వాత రజినీ లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఎంత లేదన్నా సంవత్సరమైనా పడుతుంది. జైలర్ రిలీజ్ అవగానే లోకేష్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రజినీ. ఆ లోపు లోకేష్ కూడా ఫ్రీ అవుతాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్న వశిష్ఠ రజినీ, చిరూలతో ఏ హీరోతో ముందుగా సెట్స్ కి వెళతాడో చూడాలి.













