Raviteja: చిరంజీవి డైరెక్టర్ తో రవితేజ మూవీ
ఏడాది పొడవునా ఏదొక సినిమాతో బిజీగా ఉండే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) కూడా ఒకరు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే రవితేజ రీసెంట్ గా మాస్ జాతర(mass jathara)తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో ఫ్లాపును అందుకున్నాడు. గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, ప్రస్తుతం తన 76(RT76)వ సినిమాను కిషోర్ తిరుమల(Kishore Tirumala)తో చేస్తున్న సంగతి తెలిసిందే.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
(bhartha mahasayulaki vignapti) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టుకు రవితేజ ఓకే చెప్పారని సమాచారం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(vassishta) దర్శకత్వంలో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వశిష్ట చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథకు రవితేజ నెరేషన్ టైమ్ లోనే ఇది నా స్టైల్ లోనే ఉంది అని తలూపారని తెలుస్తోంది.
ఆల్రెడీ స్క్రిప్ట్, డేట్స్ లాక్ అయ్యాయని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే వీలుందని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో చేస్తున్న విశ్వంభర(viswambhara) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్న వశిష్ట, ఆ సినిమా రిలీజయ్యే లోపు తన నెక్ట్స్ మూవీని సెట్ చేసుకోవాలని భావించి, అందులో భాగంగానే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి వశిష్ట అయినా రవితేజకు సక్సెస్ ను ఇస్తారేమో చూడాలి.







