Dhoom Kethu: వార్2, కూలీలకు చిన్న సినిమా టెన్షన్
ఆగస్ట్ 14న ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవబోతుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు, భారీ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ఒకటి అయాన్ ముఖర్జీ(ayaan mukharjee) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik roshan) కలిసి నటించిన వార్2(war2). యష్ రాజ్ ఫిల్మ్స్(yash raj films) నుంచి వస్తోన్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఇక రెండో సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ(Coolie). సన్ పిక్చర్స్(sun pictures) నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున(nagarjuna), ఉపేంద్ర(upendra), ఆమిర్ ఖాన్(aamir khan), సౌబిన్ షాహిర్(Soubin shahir), శృతి హాసన్(Shruthi Haasan), సత్య రాజ్(Satyaraj) కీలక పాత్రల్లో నటిస్తుండటం, ఆ సినిమాకు అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తుండటంతో కూలీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ రెండు పెద్ద సినిమాలకే బాక్సాఫీస్ షేకవుతుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుందో అని ఫ్యాన్స్ అనుకుంటుంటే ఇప్పుడు ఓ చిన్న సినిమా వీటిని భయపెడుతుది. బెంగాల్ మూవీ ధూమ్ కేతు(Dhoom kethu) వల్ల ఈ రెండు సినిమాలకు బెంగాల్ లో చాలా తక్కువ క్రేజ్ ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ అక్కడ ఈ సినిమా టికెట్ బుకింగ్స్ లో దూసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుకింగ్స్ లో వార్2, కూలీని అధిగమించిన ధూమ్ కేతు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.







