Coolie: కూలీ తెలుగు హక్కులకు భారీ డిమాండ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తున్న సినిమా కూలీ(Coolie). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఖైదీ(Khaidhi), విక్రమ్(Vikram), లియో(Leo) సినిమాలతో సౌత్ లో సెన్సేషన్ సృష్టించిన లోకేష్ కూలీ సినిమాను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) లో కాకుండా స్టాండలోన్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా జరుపుకుంటుంది. లోకేష్- రజినీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో కూలీపై అందరికీ విపరీతమైన అంచనాలున్నాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా కూలీకి మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కూలీ తెలుగు రైట్స్ పై భారీ ఆసక్తి నెలకొంది.
కూలీ తెలుగు హక్కుల కోసం చిత్ర నిర్మాతలకు బయ్యర్లు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రైట్స్ కోసం సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) పోటీ పడుతున్నాయని, రూ.40- 45 కోట్ల మధ్య ఈ డీల్ ను ముగించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ రెండు సంస్థలు కలిసి కూలీ రైట్స్ ను దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న కూలీలో ఉపేంద్ర(Upendra), నాగార్జున(Nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.