Chiranjeevi: చిరూ ఫ్యాన్స్ కు ఈసారి పండగే!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. ప్రస్తుతం విశ్వంభర(Viswambhara), మెగా157(mega157) సినిమాలను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు చిరంజీవి. అందులో భాగంగానే ఇప్పటికే విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ(chiru), త్వరలోనే మెగా157 షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ సినిమా, బాబీ కొల్లి(Bobby Kolli)తో మరో సినిమాను లైన్ లో పెట్టారు చిరూ.
కాగా టాలీవుడ్ లో సెలబ్రిటీల బర్త్ డే సందర్భంగా మేకర్స్ వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తారనే సంగతి తెలిసిందే. ఆగస్ట్ 22న చిరూ బర్త్ డే సందర్భంగా ఈసారి మెగా ఫ్యాన్స్ కు వరుస అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకండా మూడు అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ కు రాబోతున్నాయని సమాచారం అందుతుంది.
వశిష్ట(Vasishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర నుంచి ఓ చిన్న వీడియోతో పాటూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట. దాంతో పాటూ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా157 టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట. ఈ రెండూ కాకుండా మెగా158(Mega158)కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చిరూ పుట్టిన రోజు సందర్భంగా వస్తుందని తెలుస్తోంది. ఇది నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ కు ఈసారి పండగే.







