జయప్రదకు బిగ్ షాక్
సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.













