Mrunal-DQ: ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన దుల్కర్, మృణాల్
బిగ్ స్క్రీన్ పై మంచి క్రేజ్ అందుకున్న జంటలు కొన్ని ఉంటాయి. అందులో దుల్కర్ సల్మాన్(Dulquer salman), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జోడీ కూడా ఒకటి. సీతారామం(sitaramam) మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. 2022లో హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంతో మంచి హిట్ గా నిలవగా, ఆ సినిమాలో వీరిద్దరి జోడీ చూసి అందరూ చూడముచ్చటగా ఉందని తెగ ప్రశంసించడంతో పాటూ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బావుంటుందనుకున్నారు.
కానీ సీతారామం తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేసింది లేదు. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో దుల్కర్, మృణాల్ కలిసి మరో సినిమా చేయబోతున్నారేమో అని ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ వారిద్దరూ కలిసి నటించింది సినిమాలో కాదు, ఓ సాంగ్ కోసమని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
ఏఆర్ రెహమాన్(AR Rahman) కంపోజ్ చేసిన భిగీ భిగీ(bheegi bheegi) అనే సాంగ్ లో దుల్కర్, మృణాల్ ఇద్దరూ నటించారు. రెహమాన్ కొడుకు అమీన్(Ameen), జస్లీన్ రాయల్(Jasleen Royal) ఆలపించిన ఈ సాంగ్ లో వారి కెమిస్ట్రీ బావున్నప్పటికీ పాట మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇప్పటికే ఈ పాటపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి దుల్కర్(DQ), మృణాల్ సీతారామంకు సీక్వెల్ గా సినిమా వస్తుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కాంబోలో సాంగ్ రావడంతో పాటూ అది అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో వారి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.






