Bhagrasri Borse: బచ్చన్ పాప ఆశ నెరవేరేనా?
తెలుగు తెరకు ఇటీవల పరిచయమైన అందమైన హీరోయిన్లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri borse) కూడా ఒకరు. మిస్టర్ బచ్చన్(Mr.bachan) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా ఆ సినిమాలో తన అందం, డ్యాన్సులు, అందాల ఆరబోతతో అవకాశాలను అందుకుంది. రెండో సినిమాగా విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో కింగ్డమ్(Kingdom) చేస్తే ఆ సినిమా కూడా భాగ్యశ్రీకి సక్సెస్ ను ఇవ్వలేకపోయింది.
మొదటి రెండు సినిమాలూ ఫ్లాపైనా భాగ్యశ్రీకి ఛాన్సులు మాత్రం ఆగిపోలేదు. దుల్కర్ సల్మాన్(dulquer salman) తో ఓ సినిమా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni)తో ఓ సినిమాను ఒప్పుకుని వాటి షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు ఒకే నెలలో వాటితో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయింది భాగ్యశ్రీ. వాటిలో ముందుగా కాంత(Kantha) సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.
తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్యువల్ గా తెరకెక్కిన కాంత సినిమాలో భాగ్యశ్రీకి నటనా ప్రాధాన్యమున్న పాత్రే దక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. పైగా ఈ మూవీతో అమ్మడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా తనకెలాగైనా మంచి సక్సెస్ ను అందిస్తుందని కాంతపై భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి కాంత అమ్మడి ఆశల్ని నెరవేరుస్తుందో లేదో చూడాలి.







