ఆ సీనియర్ హీరోతో త్రిష
కొన్నాళ్ల పాటూ తెలుగులో వరుసగా సినిమాలు చేసి త్రిష, ఆ తర్వాత కోలీవుడ్ కు పరిమితమైంది. మెగాస్టార్, నాగ్, మహేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన త్రిష, తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన సత్తా చాటుకోవాలని ట్రై చేసింది కానీ అది సక్సెస్ కాలేదు. ఆడియన్స్ త్రిషను సోలోగా యాక్సెప్ట్ చేయకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
మళ్లీ రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీతో అమ్మడు ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. ఆ సినిమాలో అమ్మడి అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష రాణిలా మెరిసిపోయింది. ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న త్రిష, అదే టైమ్ లో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.
దీంతో క్రమంగా ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి. అలా వచ్చిన సినిమానే విజయ్ తో ఆమె చేసిన లియో మూవీ. లియోలో త్రిష అందానికి ఆడియన్స్ మరోసారి ముగ్ధులయ్యారు. లియో తర్వాత త్రిషకు మళ్లీ ఛాన్సులు ఎక్కువ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి సినిమాలో నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో కూడా త్రిషను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. బాలయ్య పక్కన త్రిష అయితే సరిగా సరిపోతుందని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్యతో కలిసి లయన్ మూవీలో నటించిన త్రిష ఈ సినిమాలో నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.













