War2: వార్2 తప్పంతా అతనిదే

అనుకున్నదొక్కటి అయినది ఒకటి అన్నట్లైంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్(Yash Raj Films) సంస్థ పరిస్థితి. ఎన్నో అంచనాలతో, భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో తీసిన వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ సోమవారం నుంచి భారీ డ్రాప్స్ మొదలయ్యాయి.
డ్రాప్స్ చూస్తుంటే వార్2(War2) బ్రేక్ ఈవెన్ అవడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. అంతేకాదు, వార్2 సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ లో అతి పెద్ద నష్టాలు అందుకున్న నిర్మాణ సంస్థగా నిలుస్తుందని కూడా ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. దీనికంతటికీ కారణం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(ayaan mukharjee)నే. వార్2 లాంటి ప్రాజెక్టును అతను హ్యాండిల్ చేసిన విధానం ఎవరినీ మెప్పించలేకపోయింది.
ఓ వైపు ఎన్టీఆర్, మరోవైపు హృతిక్ రోషన్ తో పాటూ యష్ రాజ్ సంస్థ లాంటి బిగ్ బ్యానర్ బ్యాకప్, వీటన్నింటికీ తోడు బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనే అడ్వాంటేజ్.. వీటిలో ఏ ఒక్కదాన్నీ అయాన్ సరిగా వాడుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు వార్2 రిజల్ట్ చూశాక తప్పెవరిది అంటే అందరి వేళ్లూ అయాన్ వైపే చూపిస్తున్నాయి. అయితే ఎంత అనుకున్నా ఇప్పుడు చేసేదేమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం?