ఆ డైరెక్టర్‌తో రవితేజ మూవీ!
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా రవితేజ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న రవితేజ, కొత్త డైరెక్టర్ లకు కూడా ఛాన్స్ లు ఇస్తున్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో దసరా కు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ఈగల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు రవితేజ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈగల్ తర్వాత రవితేజ మరికొంత మంది డైరెక్టర్ లతో పని చేయనున్నాడు.
రవితేజ కోసం కూడా చాలా మంది డైరెక్టర్లు లైన్ లో ఉన్నారు. కానీ రవితేజ మాత్రం జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో ఆకట్టుకున్న అనుదీప్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట. అనుదీప్ కామెడీ టైమింగ్ బాగా నచ్చడంతో అతనితో ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలని భావిస్తున్నాడట రవితేజ. కానీ ఇప్పటివరకు అనుదీప్ నాలుగు కథలు చెప్పినా అవేమీ రవితేజకు నచ్చట్లేదట. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ తర్వాత అనుదీప్ తో మరో సారి స్టోరీ సిట్టింగ్ వేయనున్నాడట రవితేజ. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి కామెడీ సినిమా రాకపోవడంతో అనుదీప్ కామెడీ టైమింగ్ నచ్చడంతో ఎలాగైనా అతనితో సినిమా చేయాలని చూస్తున్నాడట రవితేజ.













