Dhurandhar2: ధురంధర్2 ఖాతాలో మరో రికార్డు
బాలీవుడ్లో సంచలన విజయంగా నిలుస్తున్న ధురంధర్2(Durandhar2) ఇప్పుడు కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే కాకుండా వీక్షణల పరంగానూ కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమాను ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్లకు పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించారు. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిందనే అభిప్రాయాన్ని ఈ సినిమా బలంగా సవాల్ చేస్తోంది. ఇంతకుముందు ఈ అరుదైన జాబితాలో పుష్ప2(pushpa2), గదర్(gadhar), జవాన్(jawaan), స్త్రీ2(Stree2), ఛావా(Chhava) లాంటి సినిమాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ధురంధర్ 2 కూడా ఆ లిస్ట్‌లో చేరడం గమనార్హం.
పాన్ ఇండియా స్థాయిలో ఫుట్‌ఫాల్స్ రేస్‌ను పరిశీలిస్తే, ప్రస్తుతం పుష్ప2 సుమారు 4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో అగ్రస్థానంలో ఉంది. అయితే, ధురంధర్ 2 పూర్తి రన్ ముగిసే నాటికి 5 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, హిందీ మార్కెట్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే సామర్థ్యం ఈ సినిమాకు ఉందని చెప్పాలి. ఇదిలా ఉండగా, ఈ ఫ్రాంచైజ్ రణ్వీర్ సింగ్(Ranveer singh) కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది.
గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న రణవీర్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ను ఇచ్చింది. డైరెక్టర్ ఆదిత్యధర్(Aditya dhar) కూడా ఈ ప్రాజెక్ట్‌తో తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నారు. కథనం, మాస్ ఎలిమెంట్స్, భావోద్వేగాలను సమతౌల్యంగా మిళితం చేయడం ఈ సక్సెస్ కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రెండో వారాంతంలోనే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, హైయెస్ట్ సెకండ్ వీకెండ్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. మొత్తంగా చూస్తే, టికెట్ సేల్స్ మరియు వసూళ్ల పరంగా ధురంధర్2 ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి








