స్టార్ హీరోల సినిమాలకే నో చెబుతున్న అనిరుధ్!
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకోవాలని ఎదురుచూసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander).. ఇప్పుడు అదే స్టార్ హీరోల నుంచి వస్తున్న ఆఫర్లను రిజెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. తనదైన మ్యూజిక్ తో సౌత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ అనిరుధ్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆయన మ్యూజిక్ అందిస్తే సినిమాకు స్పెషల్ హైప్ వస్తుందనే నమ్మకం నిర్మాతలు, హీరోల్లో బలంగా పెరిగింది.
ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే అనిరుధ్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) నటిస్తున్న కింగ్(King) సినిమాకు మ్యూజిక్ అందించేందుకు మొదట అనిరుధ్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వరుస సినిమా కమిట్మెంట్లు, పర్సనల్ లైఫ్‌ల ఓ పెళ్లి ఏర్పాట్ల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్ర హీరోల సినిమాలకు వచ్చిన అవకాశాలను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం మరో రెండేళ్ల వరకు అనిరుధ్ షెడ్యూల్స్ పూర్తిగా బిజీగా ఉన్నాయని, ఈ టైమ్ లో కొత్త భారీ ప్రాజెక్టులను అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్(ram charan), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు ఆయన మ్యూజిక్ అందిస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే ఆయన అంగీకరించిన ఏకైక తెలుగు భారీ ప్రాజెక్టు కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అవకాశాల కోసం ఎదురుచూసిన స్థాయి నుంచి, అవకాశాలను ఎంపిక చేసుకునే స్థాయికి చేరడం అనిరుధ్ సాధించిన అరుదైన విజయంగా చెప్పుకోవచ్చు.







