Anirudh: ఆ విషయంలో బాధగా ఉంది
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(vijay) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన్నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడు ఆ మూవీని థియేటర్లలో చూస్తామా అని అతని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అలాంటి విజయ్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం విజయ్ హెచ్.వినోత్(H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జన నాయగన్(Jana Nayagan) అనే సినిమా చేస్తున్నారు.
జన నాయగన్ సినిమానే విజయ్ కు ఆఖరి సినిమా అని, ఈ సినిమా తర్వాత విజయ్ శాశ్వతంగా సినిమాలను వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల వైపు వెళ్లనున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. అందుకే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. జన నాయగన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
అయితే ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh) రీసెంట్ గా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జన నాయగన్ సినిమా ఆడియో లాంఛ్ ను ఓపెన్ గ్రౌండ్ లో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నామని, ఆ ఈవెంట్ లో ఫ్యాన్స్ తో పాటూ విజయ్ కు కూడా తాను ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నానని, కానీ ఈ సినిమా ఆయనకు ఆఖరి సినిమా అవడం తనకు చాలా బాధగా ఉందని అనిరుధ్ చెప్పాడు.






