Ajith: ఇలాంటి వాటి వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరొస్తుం
ప్రముఖ తమిళ హీరో విజయ్(vijay) తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(Tamilaga vetri kaligam) బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు కరూర్(Karur) వద్ద భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఎంతోమంది ఫ్యాన్స్, ప్రజలు తమ ప్రాణాలను కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఆల్రెడీ ఎంతో మంది సెలబ్రిటీలు రియాక్ట్ అవగా, వారంతా దాదాపు రాజకీయ నాయకులే.
ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ తొక్కిసలాట గురించి పెద్దగా ఎవరూ రెస్పాండ్ అవలేదు. అయితే తాజాగా ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith kumar) ఈ విషయంపై స్పందించి మాట్లాడారు. ఈ తొక్కిసలాట విషయంలో ఎవరినీ తక్కువ చేయడం చేయడం తన ఉద్దేశం కాదని, కానీ ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు.
ఈ దుర్ఘటనకు విజయ్ తో పాటూ ప్రతీ ఒక్కరూ బాధ్యులేనని, ఇలాంటి వాటిపై మీడియా ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించాలని, సినీ సెలబ్రిటీల సభల్లోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని అజిత్ చెప్పారు. ఇలాంటి విషాదాలు జరగడం వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరొస్తుందని అజిత్ రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పారు. సినీ సెలబ్రిటీలు బయటకు వస్తే జనాలు ఎగబడాతారని తనకు తెలుసని, అందుకే తాను పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఎప్పుడూ స్కూల్ కు కూడా వెళ్లనని ఆయన పేర్కొన్నారు.







