Ajay Bhupathi: కొరటాల బ్యానర్ లో అజయ్ భూపతి
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay bhupathi) మరోసారి వార్తల్లో నిలిచారు. రామ్ గోపాల్ వర్మ(RGV) శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఆర్ఎక్స్ 100(RX100)తో సంచలన డెబ్యూ ఇచ్చి తనదైన స్టైల్‌ను నిరూపించారు. అయితే అతని రెండో సినిమా మహా సముద్రం(maha samudram) ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, మంగళవారం(mangalavaram) మూవీతో ఘనంగా కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా కథా నిర్మాణం, టెక్నికల్ విలువలు విశేషంగా ప్రశంసలు అందుకోవడంతో అజయ్ భూపతిపై మరోసారి దృష్టి పడింది.
ప్రస్తుతం ఆయన శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఘట్టమనేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో జయ కృష్ణ(Jaya krishna) టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. జూలైలో రిలజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, అజయ్ భూపతి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(koratala siva)కు చెందిన యువసుధ ఆర్ట్స్(Yuva sudha arts) బ్యానర్‌తో కొత్త కథపై చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో మంగళవారం2(mangalavaram2) పై కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీక్వెల్‌కు సంబంధించిన కథను అజయ్ భూపతి ఇటీవల కొరటాల శివ, నిర్మాత మిక్కిలినేని సుధాకర్(mikkilineni sudhakar) కి వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉండగా, సరైన సమయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు యువసుధ ఆర్ట్స్ పలు యంగ్ డైరెక్టర్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి వరుస ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తుండటం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.








