ఆదర్శ కుటుంబంకు టికెట్ ధరల పెంపు.. ఏపీలో అదనపు షోలకు అనుమతి!
విక్టరీ వెంకటేష్(venkatesh) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదర్శ కుటుంబం(Aadarsa kutumbam). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో క్రైమ్ డ్రామా అంశాలు కూడా మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఆచితూచి వ్యవహరిస్తోంది.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. రిలీజైన మొదటి పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున అదనంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ పెంపులో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా తొలి పది రోజుల పాటు రోజుకు ఒక ఎక్స్ట్రా షో ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ లభించింది. దీంతో ఏపీలో సినిమా కలెక్షన్లకు ఈ డెసిషన్ ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
టికెట్ ధరల పెంపు అనంతరం ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.252గా, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.197.50గా ఉండనుంది. అయితే, తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ ధరల పెంపు వర్తించడం లేదు. శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Haarika & Hassinee Creations) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.








