తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా, టీటీడీ ఈవో రవిచంద్ర (Ravichandra), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary), సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఆలయం లోపలకు వెళ్లారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించుకుని తర్వాత మూలవిరాట్టును సేవించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad), టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యుడు రామÖర్తి తదితరులు పాల్గొన్నారు.








