అర్నబ్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది: హోంమంత్రి అనిత
అర్నబ్ తుపాను (Cyclone Arnab)ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Anitha) తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF), పోలీసు అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ స్వచ్ఛమైన తాగునీరు (Drinking water), ఆహారం, వైద్య సదుపాయాలు (Medical facilities) కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ప్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని మంత్రి సూచించారు.








