రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ సంస్కృతి : రాంగోపాల్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విధ్వంసం సృష్టిస్తూ రాయలసీమ (Rayalaseema)లో మళ్లీ ఫ్యాక్షన్ సంస్కృతిని వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) తీసుకొస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) ధ్వజమెత్తారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్ని అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ నేతలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. జడ్పీటీసీ (ZPTC) స్థానాలకు టీడీపీ 2,078 నామినేషన్లు వేస్తే, వైసీపీ 1,817 వేసింది. ఎంపీటీసీ (MPTC) స్థానాలకు మా పార్టీ 22,013 నామినేషన్లు వేస్తే, వైసీపీ 20,556 నామినేషన్లు వేసింది. అయినప్పటికీ నామినేషన్లను అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.








