ఫిట్నెస్ సీక్రెట్ ను రివీల్ చేసిన ఆమని
టాలీవుడ్లో తనదైన స్థానాన్ని సంపాదించిన సీనియర్ నటి ఆమని(Aamani) 52 ఏళ్ల వయసులోనూ చూపిస్తున్న ఫిట్నెస్, ఉత్సాహం వెనక ఉన్న జీవనశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఫిట్‌గా ఉండటానికి కఠినమైన డైట్స్, జిమ్ వర్కౌట్స్ ప్రధానంగా ఉంటాయని భావిస్తారు. అయితే ఆమని విషయంలో మాత్రం ఒక భిన్నమైన కోణం కనిపిస్తోంది. కానీ ఆమని మాత్రం ఎంతో క్రమశిక్షణ గా ఉండటం వల్లే ఇలా ఉంటుందని ఆమె మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఆమనికి వంటలో బాగా నైపుణ్యం ఉన్నప్పటికీ, ఆహారంలో నియంత్రణ పాటించడం ద్వారా శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవచ్చని ఆమె జీవన విధానం సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఆమని దినచర్యలో క్రమశిక్షణకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం తొందరగా లేచి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రోజును ప్రారంభించడం ఆమెకు అలవాటు. పూజ అనంతరం చేసే యోగా ద్వారా శారీరకంగా, మానసికంగా సమతుల్యతను సాధించడమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అది సహాయపడుతుందని ఆమె చెప్తున్నారు. ఈ క్రమంలో డైట్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ప్రత్యేకంగా ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించకపోయినా, పరిమిత మోతాదులోనే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైనంత ఎనర్జీ మాత్రమే అందేలా చూసుకుంటుంది.
గ్లామర్ రంగంలో ఉన్నప్పటికీ ఆడంబరాలకు దూరంగా ఉండటం కూడా ఆమె జీవనశైలిలో మరో ముఖ్యాంశం. పార్టీలకు, పబ్ కల్చర్‌కు దూరంగా ఉండి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. మొత్తంగా చూస్తే, కఠిన డైట్స్ కంటే నియంత్రణతో కూడిన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి, ఆధ్యాత్మిక దృక్పథం కలిసినప్పుడు మాత్రమే దీర్ఘకాలిక ఆరోగ్యం సాధ్యమని ఆమని జీవితం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది.








