Sharwanand: శ్రీను-శర్వా మూవీలో సీనియర్ హీరో?
టాలీవుడ్ టాలెంటెట్ హీరో శర్వానంద్(sharwanand) ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి(NNNM) మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న శర్వా (Sharwa), తన తర్వాతి సినిమాను ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శ్రీను వైట్ల(Sreenu vaitla)తో చేయనున్నాడు. ఈ విషయాన్ని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ మీట్ లో శర్వా అనౌన్స్ చేశాడు.
శర్వా, శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. జూన్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందని, ఆ క్యారెక్టర్ విలన్ పాత్రే అని, దాన్ని టాలీవుడ్ లోని ఓ సీనియర్ హీరో చేయనున్నట్టు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరి శర్వా సినిమాలో నటించనున్న ఆ సీనియర్ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఈ మూవీలో 8 వసంతాలు(8 vasanthalu) ఫేమ్ అనంతిక(ananthika)ను ఫైనల్ చేసినట్టు మొన్నా మధ్య వార్తలొచ్చాయి. ఈ మూవీ కోసం శర్వా తన లుక్ ను కూడా మార్చి కొత్తగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి శ్రీను వైట్ల ఈ మూవీతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.




