పల్లెటూరి పిల్లగా మహానటి కొత్త లుక్!
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12 విడుదల. సంక్రాంతి టార్గెట్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో లతారెడ్డి అనే విభిన్నమైన పాత్రలో కీర్తి కనిపించనుంది.
పొలంలో ట్రాక్టర్ నడుపుతూ, హాఫ్ శారీలో కళ్లద్దాలతో కనిపిస్తున్న కీర్తి లుక్ ఎంతో ఎట్రాక్టివ్ గా ఉంది. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ఆమె క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరు పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎనర్జీ కలిగిన యువతిగా లతారెడ్డి క్యారెక్టర్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచనుందని మేకర్స్ భావిస్తున్నారు. మహిళా పాత్రలకు తనదైన శైలిలో ప్రత్యేకతను జోడించే అనిల్ రావిపూడి, ఈ సినిమాలోనూ కీర్తి కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఊటీలో సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతోంది. కీలక సీన్స్ ను ప్రధాన తారాగణంపై తెరకెక్కిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అనిత, సురేష్ బాబు , జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పండుగ వాతావరణంలో కుటుంబమంతా కలిసి ఆస్వాదించే ఎంటర్టైనింగ్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు.








