Jeffrey Epstein : అమెరికా సెక్స్ కుంభకోణంలో … ప్రముఖుల పేర్లు

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణాన్ని ట్రంప్ (Trump) సర్కారు మరోసారి తెర పైకి తెచ్చింది. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఆఘాయిత్యాలకు పాల్పడిన ఉదంతం 2005లో బయటపడిరది. ఈ దారుణానికి సంబంధించిన కీలక పత్రాలను ఆ దేశ జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. దీనికి ది ఎప్‌స్టీన్ ఫైల్స్ ఫేజ్ 1 అని పేరు పెట్టింది. ఇప్పటికే పలు విడతలుగా ఈ కుంభకోణంలోని ఫైల్స్ బహిర్గతం అయ్యాయి. తాజాగా వెల్లడైన వాటిలో కొన్ని కొత్త అంశాలున్నాయి. కాంటాక్ట్ లిస్ట్ జాబితా, ఫ్లైట్ లాగ్ సమాచారం, అతడికి వ్యతిరేకంగా సేకరించిన అధారాలు ఉన్నాయి.
తాజా జాబితాలో ఇంగ్లిష్ రాక్‌బ్యాండ్ రోలింగ్ స్టోన్ సభ్యులు మైక్ జాగర్, ప్రముఖ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ (Michael Jackson) , యాక్టర్ అలెక్ బాల్డ్‌విన్, అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి ఆర్‌ఎఫ్ కెన్నడీ జూనియర్ తల్లి ఎథెల్ కెన్నడీ, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో (Andrew Cuomo) , సూపర్ మోడల్ నవోమీ క్యాంప్‌బెల్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇక కెన్నడీ కుటుంబానికి చెందిన కెర్రీ, టెడ్, డొనాల్డ్ ట్రంప్, మాజీ భార్య ఇవాన ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్ (Ivanka Trump) పేర్లు కూడా ఉన్నాయి. వీరంతా ఎప్‌స్టీన్ కస్టమర్లు కాదని, కాంటాక్ట్ లిస్ట్‌లోని పేర్ల జాబితిగా అధికారులు చెబుతున్నారు.