భారత్ తమకు అత్యవసర భాగస్వామి.. మాట మార్చిన అగ్రదేశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కరోజుకే మాట మార్చారు. భారత్ తమకు అత్యవసర భాగస్వామి అని పేర్నొన్నారు. క్వాడ్ దేశాల పరంగా భారత్ సంబంధాలు తమకు ద్వైపాక్షికంగా ఎంతో కీలకమని అమెరికాకు భారత్ ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని తమకు తెలుసునని అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. ఇండోపసిఫిక్ సంబంధాల పరంగా స్వేచ్ఛాయుతమైన సంబంధాలు కొనసాగిస్తామన్నారు. క్వాడ్ దేశాల లక్ష్యసాధనలో భారత్ కీలకమని అమెరికా హోంశాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ వెల్లడించారు. క్వాడ్ నేతలు ఈ నెల మూడోతేదీ సమావేశం తర్వాత అమెరికా వాణిజ్య మంత్రి ఆంటోని బ్లింకెన్ భారత విదేశాంగమంత్రి డా.ఎన్.జైశంకర్ను కలిసి ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిచేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారని తెలిపారు.






