వోగ్ మ్యాగ్జిన్ కవర్ పేజీలో కమలా హ్యారిస్
ఫ్యాషన్ బైబిల్‌గా కీర్తించబడే వోగ్ మ్యాగ్జిన్ తన కవర్ పేజీలో మరోసారి కమలా హ్యారిస్ ఫోటోను చిత్రీకరించనున్నది. నెల వ్యవధిలోనే హ్యారిస్ ఫోటోను రెండోసారి కవర్‌పేజీపై వేయడం ప్రత్యేకం. ఇటీవల కమలా ఫోటోను కవర్‌పేజీలో చిత్రించిన వోగ్ మ్యాగ్జిన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఫోటోలో హ్యారిస్ లుక్‌పై నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఉపాధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా మరీ అతిగా ఆమె ఫోటోను డిజైన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వోగ్ మ్యాగ్జిన్ ప్రత్యేకంగా కొన్ని కాపీలను ప్రింట్ చేసేందుకు డిసైడ్ అయ్యింది. కవర్ పేజీ కోసం కొత్త ఫోటోను కూడా ఆ మ్యాగ్జిన్ సెలక్ట్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.






