Europe ఐరోపాకు అమెరికా షాక్

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న అమెరికా, ఐరోపా దేశాలకు షాకిచ్చింది. అనూహ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరీ రష్యా (Russia)కు మద్దతుగా నిలిచింది. యుద్ధానికి రష్యాయే కారణమన్న వాదనను తోసిపుచ్చింది. ఐక్యరాజ్య సమితి (United Nations )లో ఐరోపా దేశాలతో విభేధించింది. రష్యా దురాక్రమణదారు అనడాన్ని వ్యతిరేకించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరోపా దేశాలు ప్రవేశపెట్టిన తీర్మాలను రష్యాతో కలిసి అమెరికా(America) వ్యతిరేకించింది. రష్యాకు అనుకూలంగా భద్రతా మండలి (Security Council )లో తీర్మానాన్ని ఐరోపా దేశాలను కాదని మరీ ఆమోదించుకుంది.