పాకిస్థాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలి : అడమ్
పాకిస్థాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని దేశ చట్టసభ సభ్యులు అడమ్ కింజింగెర్ డిమాండ్ చేశారు. పంజ్‌షీర్‌లో ప్రతిఘటన దళాలను అణచివేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ బలగాలు పెద్ద ఎత్తున సాయం అందించడంపై అడమ్ స్పందించారు. అప్ఘనిస్థాన్‌లో ఇప్పటి కల్లోల పరిస్థితుల్లో పాకిస్థాన్ వహిస్తున్న పాత్రను బైడెన్ అధికార యంత్రాంగం అత్యంత జాగరూకతతో పర్యవేక్షించాలని అన్నారు. తాలిబన్లకు ఈ లోయ ఆపరేషన్ దశలో పాకిస్థాన్ నుంచి 27 హెలికాప్టర్లు అందాయని, వీటిలో అత్యంత సురక్షితులైన ప్రత్యేక బలగాలు వచ్చాయని, తోడుగా పాకిస్థానీ డ్రోన్లతో దాడులు కూడా సాగించారని తెలిసింది. కేవలం సాయం తాత్కాలికంగా నిలిపివేయడమే కాదు ఈ దేశాన్ని పూర్తిగా తీవ్ర స్థాయి ఆంక్షల జాబితాలోకి తీసుకురావాల్సి ఉందన్నారు.






