తాలిబన్ లకు అగ్రరాజ్యం భారీ షాక్!
తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఎవ్వరి మీదా ప్రతీకార చర్యలు లేవు. తమ నాయకుడి ఆదేశాల మేరకు అందరిని క్షమించేశాం. అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామంటూ ప్రకటించిన తాలిబన్ ల దూకుడుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. తాలిబన్ లకు దక్కకుండా నిధులను స్తంభింప చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్ఘన్కు సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్ నిధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.5 బిలియన్ డాలర్ల మేర నిధులను నిలివేసింది. తాలిబన్ ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది.






