ట్రంప్ లాగా తాను మిత్ర దేశాలకు షాక్ ఇవ్వను!
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లాగా తాను మిత్ర దేశాలకు షాక్ ఇవ్వనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికాపై ప్రయాణ నిషేధాన్ని పొడిగించాలా వద్దా అనే విషయంపై వారానికి ఒకసారి నిర్ణయం తీసుకుంటామని బైడెన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా సహా ఏడు ఇతర దేశాలపై ఎంతకాలం పాటు ప్రయాణ ఆంక్షలు కొనసాగుతాయన్న ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. అది వైరస్ తీవ్రతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రత, ఇతర పరిస్థితులపై ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తామని అనంతరం నిషేధంపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.






