రిపబ్లికన్ నేతకు ట్విట్టర్ షాక్ …
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను ఇటీవల ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన మార్జోరీ టేలర్ గ్రీన్ అకౌంట్‌ను కూడా ట్విట్టర్ సంస్థ లాక్ చేసింది. జార్జియా రాష్ట్రం నుంచి టేలర్ కొత్తగా ఎన్నికయ్యారు. నవంబర్ ఎన్నికల్లో మోసం జరిగినట్లు నిరాధార ఆరోపణలు చేయడంతో ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పలు మార్లు ఆమె తమ సంస్థ ఐక్య విధానాలను ఉల్లంఘించినట్లు ట్విట్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. గతంలోను ఆమె క్వానన్ (QAnon) కుట్ర సిద్ధాంతాన్ని ట్విట్టర్లో ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017లో అమెరికా క్వానన్ కుట్ర సిద్ధాంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సిద్ధాంతాలకు ఆమె మద్దతు పలికింది.






