Sunitha Williams : మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాం : ట్రంప్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లో వ్యోమగాములు సునీత విలియమ్స్ (Sunitha Williams), బుచ్ విల్‌మోర్ (Butch Wilmore) 9 నెలలుగా చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారు భూమి మీదకు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. తీసుకెళ్లడానికి వస్తున్నాం అని వ్యోమగాములకు సందేశం పంపిస్తూ భరోసా ఇచ్చారు. అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన ( బైడెన్) కారణంగానే ఇంతకాలం మీరు చిక్కుకుపోయారని, వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్ (Biden) ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.
వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని విమర్శించారు. ఇకపై అలా జరగనివ్వనని ఆయన పేర్కొన్నారు. వ్యోమగాములను సురక్షితంగా భూమి పైకి తీసుకొచ్చే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అప్పగించినట్లు ట్రంప్ వెల్లడిరచారు.