Donald Trump: కిమ్‌తో నాకు సత్సంబంధాలున్నాయి : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un )తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటె (Mark Rutte )తో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. కిమ్‌తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా? అని విలేకరి ప్రశ్నించగా, కిమ్ జోంగ్ ఉన్‌తో నాకు మంచి సంబంధం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ, కిమ్ కచ్చితంగా ఒక న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ బదులిచ్చారు. ఈ సందర్భంగా రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి ఆయన ప్రస్తావించారు. అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనే దానికంటే. అవి ఇతరుల వద్ద కూడా ఉండటం అవసరమని ట్రంప్ తెలిపారు. భారత్(India), పాకిస్థాన్ (Pakistan) వంటి ఇతర దేశాల వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని ఇతరులకు సైతం ఇవ్వాలని ట్రంప్ పేర్కొన్నారు.