Trump: బైడెన్ నిర్ణయం తెలివి తక్కువ పని : ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధంలో అమెరికా(America) తయారు చేసి దీర్ఘ శ్రేణి ఆయుధాలను వాడేందుకు జెలెన్స్కీని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అనుమతించడాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పుబట్టారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం తెలివితక్కువ పనిగా అభివర్ణించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు తదుపరి బాధ్యతలు చేపట్టబోయే తన యంత్రాంగాన్ని సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. మరోవైపు ట్రంప్ విమర్శలపై శ్వేతసౌధం (White House) స్పందించింది. మేము ఈ నిర్ణయం ఎన్నికలకు ముందే చర్చలు జరిపి తీసుకున్నాం. కాబట్టి దీని గురించి బాధ్యతలు చేపట్టబోయే వారికి చెప్పాల్సిన అవసరం లేదు అని శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.






