Joe Biden :బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడిరచారు. బైడెన్ కుమారుడు హంటర్ (Hunter) భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్‌కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక కుమార్తె ఆష్లే (Ashley), బైడెన్‌కు 13 మంది ఏజెంట్లతో కూడిన భద్రత ఉందన్నారు. ఈ రక్షణను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ వెల్లడిరచారు. దీనిపై మాజీ అధ్యక్షుడు కార్యాలయం ఇంకా స్పందించలేదు.
అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం మాజీ అధ్యక్షుడు, వారి జీవిత భాగస్వాములకు జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ ఉంటుంది. వారి సంతానానికి 16 ఏళ్ల దాటితే మాత్రం అధ్యక్ష కార్యాలయాన్ని వీడిన వెంటనే భద్రతను తొలగిస్తారు. కానీ, పదవి నుంచి దిగిపోయే ముందు బైడెన్ తన సంతానానికి కల్పించే రక్షణను జులై (July )వరకు పొడిగించుకుంటూ ఉత్తర్వులపై సంతకం ఏశారు. అంతుకుముందు ట్రంప్ తొలి హయాంలోనూ తన పిల్లల కోసం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు తాజాగా ప్రకటించడం గమనార్హం.