Donald Trump: అందుకే ఆ నిధులను రద్దు చేశాం : ట్రంప్

భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఆరోపించారు. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో (Indian elections) జోక్యం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారని విమర్శించారు. అందుకే డోజ్ (Doze) దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడం కోసం మనమెందుకు రూ.182 కోట్లు ( 21 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాలి. బహుళా ఆ దేశంలో మరెవర్నో గెలిపించేందుకు వారు ( బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుంది అని మయామీలో జరిగిన ఎఫ్‌ఐఐ ప్రయారిటీ సదస్సులో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది. విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ (BJP) ధ్వజమెత్తింది. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ స్పష్టం చేసింది.