Trump :హష్ మనీ కేసులో సుప్రీంకోర్టుకు ట్రంప్
హష్ మనీ కేసులో విధించనున్న శిక్షలను నిలిపివేయాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుప్రీంకోర్టు(Supreme Court )ను ఆశ్రయించారు. శిక్షను వాయిదా వేయాలంటూ చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టుల జడ్జి జువాన్ జె. మెర్చన్ (Juan J. Merchant ) తిరస్కరించడంతో ట్రంప్ న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్లారు. దీనిపై స్పందన తెలపాలని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలపై స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ నివేదికను మాత్రమే విడుదల చేస్తామని న్యాయశాఖ తెలిపింది. రహస్య పత్రాల కేసుకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచుతామని పేర్కొంది.






