TikTok: మళ్లీ అమెరికాలోకి టిక్‌టాక్ ప్రవేశం

ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok )ను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. యూఎస్ నిబంధనలకు కట్టుబడిన కారణంగా జనవరి 18న ఆ యాప్‌ను ప్లే స్టోర్ల(Play Stores) నుంచి గూగుల్(Google), యాపిల్(Apple) తొలగించాయి. దీని నిషేధాన్ని అమలు చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఆలస్యం చేయడంతో అమెరికాలోని ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలో టిక్‌టాక్ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. ఈ యాప్‌కు అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.