Donald Trump : వైద్య పరీక్షలకు హాజరైన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) (78) ఎట్టకేలకు సాధారణ వైద్య పరీక్షలు (Medical tests) చేయించుకునేందుకు ముందుకు వచ్చారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ (Walter Reed National Military Medical) సెంటర్‌లో వైద్యులు శారీరక దృఢత్వ పరీక్షలు జరపున్నారు. అమెరికా చరిత్ర లోనే 78 ఏళ్ల వయస్సులో ప్రమాణం చేసిన మొట్టమొదటి అధ్యక్షుడుగా నిలిచిన ట్రంప్ ఆరోగ్యం గురించి వివరాలు ప్రజలకు మొట్టమొదటిసారిగా తెలిసే అవకాశముంది. ఇంత ఆరోగ్యంగా నేను ఎప్పుడూ లేను. అయినప్పటికి ఇది తప్పనిసరిగా చేయాల్సింది కదా అని ట్రంప్ పేర్కొన్నారు.
గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) శారీరక, మానసిక ఆరోగ్యంపై పలుమార్లు ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. బైడెన్ కంటే మూడేళ్లు చిన్నవాడైన ట్రంప్ తన సొంత ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి మాత్రం గోప్యత పాటించారు. అధ్యక్షుడయ్యాక ఆరోగ్య వివరాలను బయటకు రానీయలేదు. అమెరికాలో అధ్యక్ష పదవి (Presidency) లో ఉన్న వ్యక్తికి ఏడాదికోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలను జరిపి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడిరచటం తప్పనిసరి.